Thursday, January 23, 2025

2024 లో దేశ ప్రధానిగా మమతాబెనర్జీ

- Advertisement -
- Advertisement -

Mamata for PM in 2024: TMC MP

బెంగాల్ సీఎంగా అభిషేక్ బెనర్జీ :టీఎంసీ ఎంపీ వ్యాఖ్య

కోల్‌కతా : 2024 లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ దేశ ప్రధానిగా పగ్గాలు చేపడతారని, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని టీఎంపీ ఎంపీ అపురూప పొద్దార్ పేర్కొన్నారు. 2036 లో అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ప్రతినిధి కునాల్ ఘోష్ ట్వీట్ చేసిన మరునాడే దానికి అపురూప పొద్దార్ వివరణ ఇచ్చారు. బెంగాల్‌లో మూడోసారి టీఎంసీ అధికారం లోకి వచ్చి ఏడాది ముగిసిన సందర్భంగా కునాల్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2036 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతాబెనర్జీ కొనసాగుతారని, 2036 లో మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఘోష్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News