Friday, November 22, 2024

ఇంటి వద్దకే రేషన్ స్కీంను ప్రారంభించిన మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

Mamata launches ration at doorstep scheme

కోల్‌కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారం ‘ద్వారే రేషన్’(ఇంటి వద్దకే రేషన్) పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీం ద్వారా తమ రాష్ట్రంలోని 10 కోట్లమందికి లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు. రేషన్ డీలర్ల కమిషన్‌ను క్వింటాకు రూ.75 నుంచి రూ.150కి పెంచుతున్నట్టు ఆమె తెలిపారు. పలు రాష్ట్రాలు బెంగాల్‌లో అమలవుతున్న పథకాలను చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆమె అన్నారు. ఈ పథకం అమలుకు అవసరమైన వాహనాల కొనుగోలుకు డీలర్లకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని మమత అందిస్తున్నారు. ఈ స్కీంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులకు వెళ్లొద్దని రేషన్ డీలర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News