వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం దుబాయ్ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘెను కలుసుకున్నారు. నవంబర్‌లో కోల్‌కతాలో జరిగే రాష్ట్ర వ్యాపార సదస్సుకు రావలసిందిగా శ్రీలంక అధ్యక్షుడిని ఆమె ఆహ్వానించారు. 12 రోజుల దుబాయ్, స్పెయిన్ పర్యటన నిమిత్తం మమతా బెనర్జీ మంగళవారం కోల్‌కతా నుంచి బయల్దేరి వెళ్లారు.
దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో తనను చూసిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె చర్చించడానికి రావాలంటూ ఆహ్వానించారని, ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయనను లాంజ్‌లో కలుసుకుని నవంబర్‌లో కోల్‌కతాలో జరిగే బెంగాల్ ప్రపంచ వ్యాపార సదస్సుకు రావలసిందిగా ఆహ్వానించానని ఎక్స్‌లో(పూర్వ ట్విట్టర్) మతత పోస్టు రాశారు. శ్రీలంకను సందర్శించవలసిందిగా విక్రమసింఘె తనను ఆహ్వానించినట్లు కూడా ఆమె తెలిపారు.
మంగళవారం సాయంత్రం దుబాయ్ చేరుకున్న మమత స్పెయిన్‌కు వెళ్లేందుకు విమానాశ్రయం లాంజ్‌లో ఎదురుచూస్తున్న సంయంలో శ్రీలంక అధ్యక్షుడు ఆమెను చూశారు.రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో వ్యాపార సదస్సులలో పాల్గొనేందకు ఆమె దుబాయ్, స్పెయిన్ పర్యటిస్తున్నారు.