- Advertisement -
ప్రశ్నకు నగదు ఆరోపణలపై చర్చ తర్వాత లోక్‌సభ నుంచి టిఎంసీ ఎంపి మహువా మొయిత్రా బహిష్కరణపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై విరుచుకుపడ్డారు. మహువా బహిష్కరణను మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. బిజెపి ప్రతికార రాజకీయలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, మహువా బహిష్కరణ అన్యాయం అన్నారు. ఈ పోరాటంలో మహువా విజయం సాధిస్తారని తెలిపారు. ప్రజలే మహువాకు న్యాయం చేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ప్రజలు ఓడిస్తారని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే మహువా మొయిత్రాను బహిష్కరించటాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. పార్లమెంట్ బయట గాంధీ విగ్రహం దగ్గర విపక్ష పార్టీల ఎంపిలు నిరసన ప్రదర్శన చేపట్టారు.
- Advertisement -