Friday, October 18, 2024

నేడు ముంబైలో ఉద్ధవ్, పవార్‌తో మమత భేటీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ముంబైలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌తో సమావేశమై దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి చర్చించనున్నారు. రిలలన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం ముంబైకు బయల్దేరడానికి ముందు మమత విలేకరులతో మాట్లాడుతూ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను కూడా కలుసుకోనున్నట్లు తెలిపారు. ముకేష్ అంబానీ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు తాను ముంబై వెళుతున్నానని, వారి నుంచి పలుసార్లు ఆహ్వానం వచ్చిందని ఆమె చెప్పారు.

బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ముకేష్ అంబానీ గతంలో అనేకసార్లు విశ్వ బంగ్ల సభలకు హాజరయ్యారని ఆమె తెలిపారు. తాను వివాహ వేడుకలకు వెళ్లేదాన్ని కానని, కాని ముఖేష్, ఆయన భార్య నీతా, వారి కుమారుడు పలుసార్లు ఆహ్వానించడంతో వెళుతున్నానని ఆమె వివరించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కలుసుకోని కారణంగా తాను ముంబైలో ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్‌తో సమావేశం కానున్నానని ఆమె తెలిపారు. శివసేన, టిఎంసి, ఎన్‌సిపి, ఎస్‌పి, కాంగ్రెస్ పార్టీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News