Sunday, September 22, 2024

ప్రజా వ్యతిరేక విద్యుత్ బిల్లును మానుకోండి

- Advertisement -
- Advertisement -

Mamata writes letter to Modi over anti-people Electricity Bill

ప్రధాని మోడీకి మమత మళ్లీ లేఖ

కోల్‌కత: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలచిన ప్రజా వ్యతిరేక విద్యుత్(సవరణ) బిల్లు, 2020పై తీవ్ర నిరసన తెలియచేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే యోచనను మానుకోవాలని ఆమె ప్రధానిని కోరారు. సాధ్యమైనంత త్వరితంగా ఈ అంశంపై విస్త్రృత స్థాయిలో, పారదర్శక చర్చలను చేపట్టాలని ఆమె తన లేఖలో కోరారు.

తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విద్యుత్(సవరణ) బిల్లును తిరిగి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రం తాజాగా ప్రయత్నిస్తుండడంపై తన నిరసనను మరోసారి తెలియచేస్తున్నానని మమత పేర్కొన్నారు. గత ఏడాది పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రతిపాదించినపుడు దీని ముసాయిదా బిల్లులో ఉన్న ప్రజా వ్యతిరేక అంశాలను తమలో చాలామంది, ముఖ్యంగా తాను ఎత్తిచూపానని ఆమె తెలిపారు. దేశ ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నంంలో భాగంగానే ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తోందని ఆగ్రహిస్తూ గత ఏడాది జూన్ 12న తాను లేఖ రాసిన విషయాన్ని ఆమె ప్రధానికి గుర్తు చేశారు.

రాష్ట్ర పరిధిలోని యావత్ విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌లో విలీనం చేయడమే ఈ బిల్లు అసలు లక్షమని ఆమె దుయ్యబట్టారు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా యధాతథంగా బిల్లును మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రతిపాదిస్తున్న విషయం తెలిసి తాను దిగ్భ్రాంతి చెందానని ఆమె తెలిపారు. ఈ సారి ఇందులో చాలా దారుణమైన ప్రజా వ్యతిరేక అంశాలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News