Wednesday, January 22, 2025

మమత బెనర్జీ వ్యాఖ్యలను తప్పు పట్టిన అసదుద్దీన్ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

 

Asadudding Owaisi

హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ముందటంత చెడ్డదేమీ కాదు’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనడాన్ని మజ్లీస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ గురువారం తప్పుపట్టారు. వీడియోలో మమతా బెనర్జీ ‘‘ బిజెపికి మద్దతు ఇవ్వని మంచి మనుషులు ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. ఏదో ఒక రోజున వారు తమ మౌనాన్ని వీడుతారు’’ అన్నారు.

ఈ సందర్భంగా 2003లో కూడా మమతా బెనర్జీ ఆర్ఎస్ఎస్ ను సమర్థించడాన్ని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ది ముస్లిం వ్యతిరేక వైఖరి అన్నారు. 2003లో మమతా బెనర్జీ ఆర్ఎస్ఎస్ వారిని నిజమైన దేశభక్తులని పొగిడారు. ఆర్ఎస్ఎస్ హిందూ దేశాన్ని కోరుకుంటోందని అన్నారు.  దానికి ప్రతిగా ఆర్ఎస్ఎస్ కూడా ఆమెను ‘దుర్గ’ అని కీర్తించింది. గుజరాత్ లో ఊచకోత తర్వాత కూడా ఆమె బిజెపికి మద్దతునిచ్చిందని అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News