Wednesday, January 22, 2025

విజయ్ దేవర కొండతో నటించనున్న మమిత బైజు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మలయాళంలో ప్రేమలు మూవీ బంపర్ హిట్ కొట్టింది.  ఈ చిత్రాని తెలుగులో కూడా విడుదల చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ  మూవీలో మమిత బైజు తన నటనతో పేరు ప్రఖ్యాతాలు సంపాదించుకుంది. ఈ అమ్మడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. మమితకు టాలీవుడ్ వరసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో కృతి శెట్టి, శ్రీలీల ఓవర్ నైట్ లో మంచి క్రేజ్ తెచ్చుకొని ఆఫర్స్ ముందు వరసలో ఉన్నారు. బైజు వీళ్లను వెనక్కి నెట్టేసి ముందుకు వచ్చేస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో మమిత బైజును హీరోయిన్ గా తీసుకున్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండ నటించి ఫ్యామిలీ స్టార్ సినిమా లో విడుదలై మంచి టాక్ తో దూసుకపోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ కు తోడుగా శ్రీలీలను ఎంపిక చేశారు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె స్థానంలో మమిత బైజును తీసుకునే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News