Thursday, January 23, 2025

చిన్న డైనోసార్లకు క్షీరదాల ఆహారం

- Advertisement -
- Advertisement -

చిన్న పెంపుడు పిల్లి వంటి ఆకారంతో చిన్నవెంట్రుకలతో కూడిన ఎగిరే డైనోసార్లు క్షీరదాలను ఆహారంగా తీసుకుంటాయని బ్రిటన్ పురావస్తు శాస్త్రవేత్తలు నిరూపించ గలిగారు. ఈ డైనోసార్ శిలాజాన్ని మైక్రోరాప్టర్ అని పరిశోధకులు పిలుస్తుంటారు. అయితే ఈ శిలాజం తన పక్కటెముకలో చిన్న ఎలుక పాదంతో కనిపించింది. అంటే ఆహారం తింటుండగానే ఇది 120 మిలియన్ సంవత్సరాల క్రితం చనిపోయిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ విధంగా శిలాజ సాక్షాలు బయటపడడం డైనోసార్లు క్షీరదాలను తింటాయన్న మొట్టమొదటి రికార్డును సృష్టించాయి.

Mammals were the diet of small dinosaursఈ క్షీరదం మన పూర్వీకులకు చెందినది కాకపోవచ్చు. అయితే చరిత్ర వెనక్కు చూస్తే మన పూర్వీకుల సంబంధిత తెగలు డైనోసార్ల ఆకలికి బలయ్యేవని తెలుస్తోంది. ఈ అధ్యయనం డైనోసార్ క్షీరదాన్ని ఆహారంగా తీసుకోవడం అనే మొదటి రికార్డును అద్భుతంగా ఆవిష్కరించ గలిగింది. ఈ అద్బుత శిలాజం బయటపడిన తరువాత తదుపరి అధ్యయనంలో డైనోసార్ పక్కటెముకలో ఇరుక్కున్న ఆహార క్షీరదం కూడా ఎలుక అంత సైజులోనే కనిపించింది. మైక్రోరాప్టర్స్ అంటే గ్రీకు భాషలో చిన్న దొంగ అని అర్ధం.

మొట్టమొదటిసారి 2000 సంవత్సరంలో మైక్రోరాప్టర్స్ శిలాజాలు బయటపడ్డాయి. ఈ డైనోసార్లు 113 నుంచి 125 మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పటి చైనా ఉన్న పురాతన అడవుల్లో నివసించి ఉండేవి. వీటి బరువు ఒక కిలో కన్నా ఎక్కువ కాదు. 2.6 అడుగుల పొడవు ఉండేవి. అయినా సరే ఇవి చిన్న విమానంలా ఎగిరే సామర్థం కలిగి ఉండేవని నిపుణులు అంచనా వేశారు. వీటి నాలుగు అవయవాలపై పొడవైన ఎగుర గలిగే రోమాలు అమర్చి ఉండేవి. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఇదివరకు ఈ రోమాలు ఎగరడానికి సహాయ పడేవా లేక జతగూడే వాటిని ఆకర్షించడానికి ఉపయోగపడేవా అన్న సందేహంలో ఉండేవారు.

కానీ ఇదివరకటి రికార్డులను పరిశీలించగా డైనోసార్లు తమ మెరిసే రెక్కలతో తమ లైంగిక పరాక్రమాన్ని ప్రదర్శించేవని తెలుస్తోంది. ఈ అధ్యయనం కన్నా ముందటి అధ్యయనంలో రోమాల డైనోసార్లు పక్షులను, బల్లులు, తొండలను, చేపలను తినేవని బయటపడింది. మైక్రోరాప్టర్ తెగలు ఆహారాన్ని కడుపు లోనే దాచుకునేవి. అయితే మైక్రోరాప్టర్ డైనోసార్లు ప్రాణులు చచ్చిన తరువాత ఆహారాన్ని తీసుకుండేవా లేక ప్రాణులు బతికుండగానే తినేవా అన్నది మిస్టరీగా ఉంది.

2019లో శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి డైనోసార్ల కడుపులో గడ్డకట్టిన క్షీరదాల శిలాజాలను కనుగొన గలిగేరు. ప్రపంచం లోనే అతి చిన్న డైనోసార్లను దక్షిణ కొరియాలో కనుగొన్నారు. ఇవి 110 మిలియన్ సంవత్సరాల నాటి శిలాజాలు. పిచ్చుక అంత పరిమాణంలో ఇవి ఉన్నాయి. మన అరచేతిలో ఇవి ఇమిడిపోతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News