Wednesday, January 22, 2025

అఖిల్ ఏజెంట్‌కు డబ్బింగ్ చెప్పిన మమ్ముట్టి(వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగులో డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మమ్ముట్టి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఏప్రిల్ 28న విడుదలవుతున్న ఏజెంట్ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల్లో చిత్రంపై అంచనాలను పెంచేసింది. అఖిల్, మమ్ముట్టితోపాటు సాక్షి వైద్య, డైనో మోరియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, మలయాళ భాషలలో విడుదలవుతోంది.

మమ్ముట్టి రా చీఫ్ కల్నల్ మేజర్ మహదేవన్ పాత్రలో నటిస్తుండగా అఖిల్ అక్కినేని సైనికుడి పాత్రలో కనిపిస్తారు. సురేందర్ రెడ్డి రచన, దర్శకత్వం చేసిన ఏజెంట్ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందింది. హైదరాబాద్, ఢిల్లీ, హంగేరిలో షూటింగ్ జరుపుకుంది. ఇదిలా ఉండగా ఇటీవలే ఏజెంట్ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సిబిఎఫ్‌సి) 8 అభ్యంతరాలను తెలిపినట్లు సమాచారం. కొన్ని చోట్ల అభ్యంతరకర మాటలను మ్యూట్ చేయడం, కొన్ని హింసాత్మక సన్నివేశాలను బ్లర్ చేయాలని సిబిఎఫ్‌సి సూచించినట్లు తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News