Saturday, April 12, 2025

ఆనందించాల్సిన వేళ… విషాధంతో అవార్డు స్వీకరించిన మమ్ముట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మలయాళీ నటుడు మమ్ముట్టి ఐదు దశాబ్దాలుగా తనదైన విజయకేతనం ఎగరేసిన నటుడు. మలయాళం బాక్సాఫీసులో ఆయన చిత్రాలకు ఆదరణ చాలా ఎక్కువ. మంచి నటుడే కాదు ఆయన సౌమ్యుడు కూడా. ఆయన నటించిన.. నన్పగల్ నేరతు మయక్కం, కాదల్, బ్రమయుగం, క్రిస్టఫర్, కన్నూర్ స్క్వాడ్, టర్బో వంటి ఆయన సినిమాలు ఆణిముత్యాలని చెప్పవచ్చు. ఇటీవల హైదరాబాద్ లో ’69 వ దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్’ జరిగింది. ఇందులో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 2023కు సంబంధించిన ఉత్తమ చిత్రాలకు గౌరవం దక్కింది. డైరెక్టర్ లిజో జోస్ పెల్లిస్సెరీ తీసిన ‘నన్పకల్ నెరతు మయక్కం’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మమ్ముటికి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది.

ఆయన ఫంక్షన్ కు హాజరై అవార్డును స్వీకరించారు. కానీ మలయాళ మెగాస్టార్ అయిన ఆయన బహుమతి స్వీకరించేప్పుడు అంతగా సంతోషంగా లేరు.  1980 దశకం నుంచి ఆయన ఫిలింఫేర్ అవార్డులు అందుకుంటున్నారు. కానీ ఈ సారి ఆయన విషాధం, ఉద్వేగభరితంగా ప్రసంగించారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయినవారిని, తమ వారిని కోల్పోయినవారిని తలచుకుని ఆయన విషాధాన్ని ప్రకటించారు. అవార్డు గెలిచిన ఆనందం ఆయనలో కనిపించలేదు. విషాధవదనమే కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News