Monday, December 23, 2024

నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వై.ఎస్.ఆర్‌గా మమ్ముట్టి, వై.ఎస్.జగన్ పాత్ర లో కోలీవుడ్ హీరో జీవా నటిస్తున్న చిత్రం యాత్ర 2. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రమిది. యాత్ర 2 సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో వైఎస్‌ఆర్‌గా మమ్ముట్టి, వైఎస్ జగన్‌గా జీవా ఇంటెన్స్ లుక్‌లో దర్శనమిచ్చారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి…

నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్‌ను కూడా పోస్టర్‌లో గమనించవచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. వైఎస్‌ఆర్ తనయుడు వైఎస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర2’ని తెరకెక్కిస్తున్నారు. యాత్ర చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు యాత్ర సినిమాను కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News