డ్రామా అంటూ బిజెపి నేతల కామెంట్స్
కోల్‌కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్లాస్టర్ వేసిన తన కాలి గాయాన్ని చూపడంపై బిజెపి, టిఎంసి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వీల్‌చైర్‌లో కూర్చొని ఆమె తన కాలుని అటుఇటూ కదిలిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దానిపై బిజెపి అధికార ప్రతినిధి ప్రణయ్‌రాయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల నుంచి సానుభూతి కోసం డ్రామా ఆడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫేస్‌బుక్‌లో మమతకు సంబంధించిన 30 పెకండ్ల వీడియోను పెట్టి, దానికి తన కామెంట్స్ జత చేశారు. వీల్‌చైర్‌లో కూర్చొని కాలుని అటుఇటూ కదపడం కాకుండా నడవడానికి ప్రయత్నిస్తే త్వరగా కోలుకుంటారంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. బిజెపి మరో సీనియర్ నేత రాహుల్‌సిన్హా కూడా మమత వీడియోపై కామెంట్స్ చేశారు. ఆమె తన గాయపడిన కాలు ఏదో కూడా ఇప్పటికే మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు. మార్చి 10న నందిగ్రాంలో కాలుజారి కింద పడటంతో మమత గాయపడిన విషయం తెలిసిందే. బిజెపి నేతల వ్యాఖ్యలపై టిఎంసి నేతలు మండిపడతున్నారు. మహిళల్ని గౌరవించడం బిజెపి నేతలు నేర్చుకోవాలంటూ వారు హితవు పలికారు.
Mamata Bannerjee’s broken leg wants to go dancing…#BengalElections2021 pic.twitter.com/ZPsD5srr3y
— Ashoke Pandit (@ashokepandit) April 2, 2021