Sunday, January 19, 2025

మామునూరుపై ముందడుగు

- Advertisement -
- Advertisement -

ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం
రూ.205కోట్లు విడుదల చేసిన
రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం
చేయాలని కేంద్రానికి లేఖ
విమానాశ్రయ నిర్మాణానికి
తొలగుతున్న అడ్డంకులు

మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో రెండవ ఎయిర్ పోర్ట్ నిర్మాణాని కి వేగంగా అడుగులు పడుతున్నాయి. వరంగ ల్ జిల్లాలోని మామునూరులో మళ్లీ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగి స్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతోంది. వి మానాశ్రయ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రూ.205 కోట్లను వి డుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా జిఒ జారీ చే సింది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి న డిజైన్లతో డిపిఆర్‌ను సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది. దీంతో మామునూరు విమానాశ్రయ విస్తరణకు మార్గం
సుగమమైంది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద నగరమైన ఓరుగల్లులో నిజాం కాలంలోనే విమానాశ్రయం ఏర్పాటైంది. ఖిలా వరంగల్ మండలం, మామునూర్‌లో ఉన్న విమానాశ్రయం ద్వారా సేవలను కూడా అందించింది. ఉమ్మడి రాష్ట్రంలో చాలాసార్లు విమానాశ్రయం పునరుద్ధరణపై ఆందోళనలు జరిగినా అడుగు ముందుకు పడలేదు. స్వరాష్ట్రంలో కూడా విమానాశ్రయం కోసం విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్‌లో మాత్రమే ఉంది. అయితే దీనిని నిర్మించిన జిఎమ్మార్ సంస్థ కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం కూడా మామునూర్ విమానాశ్రయ విస్తరణకు అడ్డంకిగా మారింది.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని సంస్థ విరమించుకోవడంతో మామునూర్ విమానాశ్రయ విస్తరణకు మోక్షం లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండవ రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ను ప్రాధాన్యత అంశంగా తీసుకుని నిర్మాణం చేపడతామని ప్రకటించింది. అందులో భాగంగా అధికారంలోకి రాగానే వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. ఎలాగైనా విమానాశ్రయ విస్తరణ చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. అయితే విమానాశ్రయానికి ఉన్న భూములను సర్వే చేయడంతో 696 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. విస్తరణ కోసం మరో 253 ఎకరాలు అవసరమని ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు స్పష్టం చేయడంతో భూసేకరణపై దృష్టి నిలిపారు. కొద్దిరోజుల క్రితమే పలువురు మంత్రుల బృందం, అధికారులు కలిసి రైతులతో మాట్లాడారు. భూములకు బదులుగా భూములు ఇస్తామని చెప్పడంతో రైతులు ఆలోచనలో పడ్డారు. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భూములు కోల్పోయే రైతులకు పరిహారం అందించేలా నిధులు కేటాయించే ఆలోచనలో సర్కార్ ముందుకు సాగుతోంది.

253 ఎకరాల భూసేకరణ
ప్రస్తుతం మామునూరు విమానాశ్రయానికి 696 ఎకరాల భూమి ఉన్నది. దీని విస్తరణకు మరో 253 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేయడంతో పనులు వేగవంతం కానున్నాయి. కొత్తగా సర్కార్ సేకరించే 253 ఎకరాలను రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎటిసి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) నేవిగేషన్ ఇన్స్‌స్ట్ట్రుమెంట్ ఇన్‌స్ట్టలేషన్ విభాగాల నిర్మాణాలకు వినియోగించనున్నారు. భూసేకరణ పూర్తయితే కొద్దినెలల్లోనే మానునూర్ విమానాశ్రయం నుంచి విమానాలు ఎగరనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News