Wednesday, January 22, 2025

ఛీ…ఛీ… వీడు మనిషేనా?

- Advertisement -
- Advertisement -

భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తికి లండన్ లోని ఒక కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. బహిరంగ ప్రదేశంలో అసహ్యకరమైన, అభ్యంతరకరమైన విధంగా ప్రవర్తించినందుకు గాను కోర్టు ఈ శిక్ష విధించింది.

ఉత్తర లండన్ లోని వెంబ్లీలో నివసించే ముఖేశ్ షా అనే 43 ఏళ్ల వ్యక్తి నవంబర్ 4, 2022న రాత్రి 11 గంటల సమయంలో సడ్బరీ టౌన్ నుంచి ఏక్టన్ టౌన్ కు వెళ్లే రైలు ఎక్కాడు. అతను ఎక్కిన రైలు బోగీలో ఒకే ఒక్క యువతి ప్రయాణిస్తోంది. బోగీ అంతా ఖాళీగానే ఉన్నా, ముఖేశ్ వేరే ఎక్కడా కూర్చుకుండా నేరుగా ఆ యువతి ఎదురుగా కూర్చుని అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

ఆమె వారించినా వినకుండా, అతను ఆమె ఎదురుగా హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. పైగా తాను తప్పుడు పనేం చేయట్లేదంటూ సమర్ధించుకున్నాడు. దాంతో ఆ యువతి తన సెల్ ఫోన్లో ఫోటో తీసి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, ముఖేశ్ ను అరెస్ట్ చేశారు. లండన్ ఇన్నర్ క్రౌన్ కోర్టు గురువారం అతనికి తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన నేరస్థుల రిజిష్టర్లో పదేళ్లపాటు రోజూ సంతకం పెట్టవలసిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News