Monday, January 20, 2025

పోలీసుల చిత్రవధ పై న్యాయ పోరాటం

- Advertisement -
- Advertisement -

మెదక్: మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్‌ను అక్రమంగా బందించి చిత్రవధ కు గురి చేసిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం నాడు మెదక్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్దంగా, న్యాయవ్యవస్థ సహాజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా మెదక్ పట్టణ పోలీసులు ఒక వ్యక్తిని అరాచకంగా ప్రవర్తించారన్నారు.

ప్రస్తుతం అతను చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి స్వయంగా కలిసి విన్నవించుకున్న చర్యలు కరువయ్యాయని మండిపడ్డారు. ఈ ఉదంతంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News