Tuesday, January 21, 2025

ఉద్యోగం పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎయిర్ పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులో నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు ల్యాప్‌టాప్‌లు, 23 మొబైల్ ఫోన్లు, ఎనిమిది చెక్‌బుక్‌లు, ఆరు బ్యాంక్ కార్డులు, 80 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని నాంపల్లికి చెందిన బాధితుడికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, నోయిడాకు చెందిన విజయ్‌కాంత్ ఫోన్ చేశాడు. ఎయిర్ పోర్టు అథారిటీలో ఉద్యోగం ఉందని చెప్పాడు. ఉద్యోగం కావాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు, బ్యాంక్ ఖాతా ఓపెనింగ్ ఫీజు, యూనీఫాం ఫీజు, ఆఫర్ లెటర్ ఫీజు ఇవ్వాలని చెప్పాడు.

ఇది నమ్మిన బాధితుడు నిజమని భావించి వారు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు రూ.2,20,324 పంపించాడు. తర్వాత నిందితడు బాధితుడికి నకిలీ ఇంటర్వూ చేసి. నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చాడు. తర్వాత నుంచి బాధితుడు ఫోన్ చేసినా నిందితుడు స్పందించడం మానివేశాడు. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ మధుసూదన్ రావు, ఎస్సై సతీష్ రెడ్డి, పిసిలు సునీల్, భాస్కర్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News