Sunday, December 22, 2024

లెబనాన్‌లోని అమెరికా ఎంబసీ వద్ద కాల్పులు… వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వద్ద స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి తుపాకీతో వచ్చి కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.ఈ సంఘటనలో ఎంబసీ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

నిందితుడు సిరియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాల్పులు జరపడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎంబసీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News