Saturday, January 11, 2025

తొలిసారి విమానంలో ప్రయాణించిన వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తొలిసారి విమానంలో ప్రయాణించిన వ్యక్తి అది గాలిలో ఉండగా బీడీ కాల్చాడు. విమాన సిబ్బందికి ఈ విషయం తెలియడంతో అరెస్టయ్యాడు. రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల ప్రవీణ్ కుమార్ తన జీవితంలో తొలిసారి విమానం ఎక్కాడు. ఆకాశ ఎయిర్ కు చెందిన విమానంలో అహ్మదాబాద్‌నుంచి బెంగళూరుకు ప్రయాణించాడు. అయితే విమానం గాల్లో ఉండగా సిబ్బంది ఉపయోగించే టాయిలెట్‌లో బీడీ కాల్చాడు. విమాన సిబ్బంది ఈ విషయం తెలుసుకొని అతడ్ని నిలదీశారు. ఆ విమానం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అవగానే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: ప్రేమ..పెళ్లి..పెటాకులేనా

విమానంలో బీడీ కాల్చి ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు.ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. కాగా తన జీవితంలో తొలిసారి విమానంలో ప్రయాణించినట్లు ప్రవీణ్‌కుమార్ పోలీసులకు చెప్పారు. తాను సాధారణంగా రైళ్లలో ప్రయాణిస్తుంటానని, ఆ సమయంలో టాయిలెట్‌లో బీడీలు కాలుస్తుంటానని చెప్పాడు. అదే అలవాటు వల్ల విమానం టాయిలెట్‌లో బీడీ కాల్చినట్లు చెప్పాడు. తొలిసారి విమానంలో ప్రయాణించడం వల్ల సంబంధిత నిబంధనలు తనకు తెలియదని, అందుకే ఈ పొరపాటు చేశానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News