Wednesday, January 22, 2025

డబ్బులు ఇవ్వకుంటే బాంబ్ తో బ్యాంక్ ను పేలుస్తా..

- Advertisement -
- Advertisement -

కుత్బల్లాపూర్:  జీడిమెట్ల పియస్ పరిధి శాపూర్ నగర్ లోని ఆదర్శ్ బ్యాంక్ లో శివాజి(32) అనే వ్యక్తి క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి… తన వద్ద బాంబ్ ఉందని, తనకు 2 లక్షల రూపాయలు ఇవ్వకుంటే బ్యాంకుని పేలుస్తానని బెదిరించాడు. దీంతో కాసేపు బ్యాంక్ సిబ్బంది భయబ్రాంతులకు గురైయ్యారు. జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్దలానికి చేరుకొని సిబ్బంది సయయంతో చాకచక్యంగా శివాజీని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.

శివాజీ చాతికి ఓ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ పరికరం కట్టి ఉండటం, పొంతన లేని సమాదానాలు చెబుతుండటం, డబుల్ బెడ్ రూమ్ కొనడానికి 2 లక్షల రూపాయలు కోసం బ్యాంక్ దొంగతనం చేస్తున్నానని చెబుతుండటంతో ఇతని మతిస్తిమితం సరిగా లేదని జీడిమెట్ల సిఐ పవన్ తెలిపాడు. ఇతను గతంలో ఎలక్ట్రానిక్ షోరూమ్ లో పనిచేసాడని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News