Monday, November 25, 2024

బిగ్‌బాస్ పేరుతో మోసం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిగ్‌బాస్‌లో అవకాశం ఇప్పిస్తానని ఓ యాంకర్‌ను మోసం చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఖమ్మం జిల్లాకు చెందిన సత్యం మాటివిలో ప్రొడక్షన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నానని పలువురికి చెప్పేవాడు. ఈ క్రమంలోనే యాంకర్‌గా పనిచేస్తున్న స్వప్న అనే యువతికి పరిచయం అయ్యాడు. తాను మాటివిలో పనిచేస్తున్నానని చెప్పాడు, దీంతో యువతి తనకు బిగ్‌బాస్‌లో అవకాశం ఇప్పించాలని కోరింది.

దీనికి అంగీకరించిన నిందితుడు కాస్టూమ్స్, ప్రచారం తదితర ఖర్చులకు రూ.5లక్షలు కావాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో బాధితురాలు పలు దఫాలుగా రూ.2.5లక్షలు నిందితుడికి ఇచ్చింది. అయినా కూడా బిగ్‌బాస్‌లో అవకాశం రాలేదు. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితురాలు సత్యంను నిలదీయగా, స్వప్నను నిందితుడు బెదిరించాడు. వెంటనే బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News