Monday, December 23, 2024

విహెచ్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested for attacking VH home

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు వి. హన్మంతరావు ఇంటి వద్ద కారుపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిద్దార్థ సింగ్ ఆరు నెలల నుంచి వి. హన్మంతరావు ఇంటి పక్కన ఉంటున్నాడు. బుధవారం రాత్రి మద్యం తాగిన సిద్ధార్థా సింగ్ ఆ మత్తులో విహెచ్ ఇంటిపై రాళ్లు విసరడమే కాకుండా ఇంటి బయట పార్కింగ్ చేసిన కారు అద్దాలను ప్యాన్‌తో ధ్వంసం చేశాడు. విహెచ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితుడి వివరాలు తెలిశాయి. వెంటనే పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News