Monday, December 23, 2024

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested for behaving indecently with girl

హైదరాబాద్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… జియాగూడ, సాయిదుర్గనగర్‌కు చెందిన జితేందర్ చావుల(30) కూలీ పనిచేస్తున్నాడు. వరుసకు అన్న అయ్యే వ్యక్తి కుమార్తె(7)తో గత వారం నుంచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు ఆలస్యంగా చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, బస్తీకి చెందిన వారు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కుల్సుంపురా పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News