Monday, December 23, 2024

డబ్బులు ఇవ్వాలని రియల్టర్‌కు బెదిరింపులు..

- Advertisement -
- Advertisement -

, సిటిబ్యూరోః ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని బెదిరించిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…శుభగృహభ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తికి ఓ వ్యక్తి ఫోన్ చేసి రూ.5కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపివేస్తానని బెదిరించాడు. దీంతో వ్యాపారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మన్నెం చంద్రశేఖర్ అనే వ్యక్తి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News