Friday, December 20, 2024

మ్యాట్రిమోనిలో పరిచయం.. వాడుకొని, పెళ్లికి నిరాకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మ్యాట్రిమోనిలో పరియం పెంచుకుని వివాహం చేసుకుంటానని చెప్పి పలువురు యువతులను మోసం చేసిన యువకుడిని రాంగోపాల్ పేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…స్థానికంగా ఉంటున్న యువతికి నాగరాజు మ్యాట్రిమోనిలో పరిచయం అయ్యాడు. వివాహం చేసుకుంటానని నమ్మించడంతో యువతి నాగరాజుతో శారీరకంగా దగ్గరయింది. తర్వాత నుంచి నిందితుడు తన ప్లాన్‌ను అమలు చేయడం ప్రారంభించాడు. చిన్ని చిన్న కారణాలు చెప్పి యువతిని వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు.

దీంతో బాధితురాలు రాంగోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగరాజు మ్యాట్రిమోనిలో పరిచయం అయిన పలువురు యువతులను ఇలాగే మోసం చేశాడని పోలీసుల విచారణలో తెలిసింది. నాగరాజుపై హైదరాబాద్‌లోని రెండు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News