పంజాగుట్ట : ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి యువతిని మాయమాటలతో మోసగించేందుకు ప్రయత్నించిన సంఘటన జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లిహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చందానగర్‌లోని మంజీరా రోడ్డులో నివసించే అస్లంఖాన్ (24) రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. కాగా ఇతనికి ఫేస్ బుక్ లో 2018వ సంవత్సరంలో రహమత్‌నగర్‌కు చెందిన యువతి (23) పరిచయమైంది. దీంతో వారిరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగి అదికాస్తా ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ముఖం చాటేశాడు.
దీంతో ఆ యువతి మరో వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఇద్దరు కలసి దిగిన ఫోటోలను సామాజిక మాద్యమాలతో పాటు బాదితురాలి కుంటుంబ సభ్యులకు, స్నేహితులకు వాట్సప్‌లో పెడతానంటూ ఆమెను మానసికంగా వేదించసాగాడు. దీంతో యువతి ఎవరికీ చెప్పుకోలేక అతనితో తిరిగి సాన్నిహిత్యం కొనసాగించింది. కాగా అతను పెళ్ళి చేసుకునేందుకు నిరాకరించడంతో యువతి చేసేది లేక తనకు జరిగిన అన్యాయాన్ని జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Man arrested for cheating on young woman in love