Monday, November 18, 2024

ఎసిబికి చిక్కిన ఉద్యోగులే టార్గెట్…

- Advertisement -
- Advertisement -

Man arrested for cheating to get job again

 

మళ్లీ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు
పలువురికి ఫోన్లు చేసి డబ్బులు పంపాలని నిందితుడి ఆదేశం
బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

మనతెలంగాణ, హైదరాబాద్ : ఎసిబికి చిక్కి సస్పెండ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి విధుల్లో చేరేలా చేస్తానని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండలానికి చెందిన బంగారు సురేష్‌కుమార్ చారి అలియాస్ నాగేశ్వర్ రావు అలియాస్ కుమార్ డిగ్రి చదువుకున్నాడు. నగరంలోని బంజారాహిల్స్, గౌరిశంకర్ కాలనీలో ఉంటున్నాడు. లంచం తీసుకుని ఎసిబికి పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకుని మోసాలు చేస్తున్నాడు. ప్రభుత్వ పై అధికారుల వద్ద నుంచి వారి లిస్టును సేకరించాడు. దాని ఆధారంగా వారికి ఫోన్లు చేస్తు ఉద్యోగాలు ఇప్పిస్తానని వారికి హామీ ఇస్తున్నాడు.

వారికి ఫోన్ చేసి తనకు డబ్బులు ఇస్తే తిరిగి ఉద్యోగం ఇప్పిస్తానని చెబుతున్నాడు. ఈ క్రమంలోనే సెక్రటేరియట్ జిఎడిలో పనిచేస్తు ఎసిబికి పట్టుబడ్డ ఉద్యోగికి ఫోన్ చేశాడు. అతడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పట్టుకున్నారు. గతంలో కూడా నిందితుడు ఇలాగే మోసం చేయడంతో పోలీసులు తొమ్మిది సార్లు అరెస్టు చేశారు. నాంపల్లి, కరీంనగర్ ఒన్ టౌన్, టూ టౌన్, సిసిఎస్ విశాఖపట్టణం, కెపిహెచ్‌బి, సైబరాబాద్ సైబర్ క్రైం, బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని గతంలో అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News