Friday, November 22, 2024

ప్రేమపేరుతో యువతులను మోసం చేస్తున్న యువకుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested for cheating Womans

18తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
లవ్, లివింగ్ రిలేషన్‌షిప్ పేరుతో ఐదుగురు యుతులను మోసం చేసిన నిందితుడు

హైదరాబాద్: ప్రేమ, సహజీవనం పేరుతో యువతులను మోసం చేస్తున్న యువకుడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 18తులాల బంగారు ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. ఎపిలోని ఈస్ట్‌గోదావరి జిల్లా, తుని మండలం, హంసవరం గ్రామానికి చెందిన షేక్ ఎండి రఫీ అలియాస్ కార్తీక్ వర్మ నిరుద్యోగి, గచ్చిబౌలిలో ఉంటున్నాడు. 2019లో పదోతరగతి పూర్తి చేసిన తర్వాత రఫీ పాలిటెక్నిక్‌లో చేరాడు, దీనిని మధ్యలోనే మానివేసి నగరానికి వచ్చి ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అదేసమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన అస్మాభానుతో వివామం జరిగగా, కూతురు ఉంది. అదనపు కట్నం తేవాలని వేధించడంతో భార్యభర్త వేరుగా ఉంటున్నారు. నిందితుడిపై గూడూరు ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడిన నిందితుడు తాను ఎన్‌ఆర్‌ఐనని సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టేవాడు.

తన తల్లిదండ్రులు విడిపోయారని అమెరికా నుంచి చిన్నప్పుడే తిరిగి వచ్చానని చెప్పేవాడు. తన తల్లి సింగపూర్‌లో వైద్యురాలిగా పనిచేస్తోందని చెబుతుండేవాడు. కార్లలో తిరుగుతూ యువతులకు గాలంవేసేవాడు. ప్రేమిస్తున్నానని, సహజీవనం చేద్దామని మాయమాటలు చెబుతూ వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాడు. ఇలా నలుగురు నుంచి ఐదుగురు యువతులను ప్రేమ, సహజీవనం పేరుతో మోసం చేశాడు. సోషల్ మీడియాను వేధికగా చేసుసుకుని మోసం చేస్తున్నాడు. వారి వద్ద నుంచి తీసుకున్న డబ్బులు, బంగారు ఆభరణాలతో జల్సాలు చేస్తున్నాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి బాధిత యువతుల ఫోన్లు లిఫ్ట్ చేసేవాడు కాదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీకాంత్, పరమేశ్వర్, శివానందం, అశోక్‌రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News