Thursday, January 23, 2025

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.7లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….రాజస్థాన్‌కు చెందిన జైపూర్‌కు చెందిన సందీప్ జైన్ కోటిలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు.

ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా, నిందితుడు పంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. బెట్టింగ్ కట్టే వారి వద్ద నుంచి డబ్బులను గూగుల్‌పే, ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News