Friday, January 10, 2025

కారు యజమానులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అద్దెకు తీసుకుని కారు యజమానులను మోసం చేస్తున్న వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని నుండి రూ. కోటి విలువైన ఎనిమిది కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి సనత్‌నగర్‌లో నివాసముంటున్న మహమ్మద్‌ అస్లాం నవాజ్‌ (33) ట్రావెల్‌ ఏజెన్సీని నెలకొల్పి వేరే కార్లను అద్దెకు తీసుకుని వారికి కొన్ని నెలల అద్దె చెల్లించాడు.

తర్వాత అతను కారు యజమానులకు చెల్లింపును ఎగ్గొట్టడం ప్రారంభించాడు. వాహనం తనదేనని వేరే వ్యక్తుల వద్ద తనఖా పెట్టి రూ. 3, నుంచి 4 లక్షలు తీసుకున్నాడని డీసీపీ (సౌత్ ఈస్ట్) సీహెచ్ రూపేష్ తెలిపారు. కారు యజమానులు అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. సోమవారం మధ్యాహ్నం అస్లాం కారులో తిరుగుతుండగా వాహనానికి సంబంధించిన పత్రాలు సమర్పించకపోవడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించగా మోసం చేసినట్లు అంగీకరించాడు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News