Thursday, November 21, 2024

చేతబడి పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః చేతబడి పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న నిందితుడిని సౌత్‌ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఛత్రినాక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.14,65,000లు, మొబైల్ ఫోన్, క్రెడిట్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్, కరీమాబాద్‌కు చెందిన సిరిగిరి మంజునాథ అలియాస్ బ్రహ్మం అలియాస్ కోయ రాజు అలియాస్ అర్జున్ రాజు అలియాస్ మంజు మంత్రాల పేరుతో పలువురు బాధితుల వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నాడు. టివిల్లో ప్రకటనల ఇస్తున్నాడు. దుర్గా దేవి జ్యోతిష్యాలయం పేరుతో ఏర్పాటు చేసి పలువురిని మోసం చేస్తున్నాడు.

నగరానికి చెందిన కందారి శ్రీకాంత్ రెడ్డి తన తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో టివిలో నిందితుడి ప్రకటన చూసి సంప్రదించాడు. వరంగల్‌కు రావాల్సిందిగా చెప్పగా అక్కడికి వెళ్లాడు. తర్వాత నవంబర్04, 2023న మంజునాథ బాధితుడి ఇంటికి వచ్చి నరదోషం ఉందని చెప్పాడు. దానిని పారద్రోలుతానని చెప్పి పూజ చేసి రూ.2,00,000 తీసుకున్నాడు. ఇలా పలు పూజలు చెప్పి బాధితుడి నుంచి రూ.17లక్షలు తీసుకున్నాడు. లక్షలాది రూపాయలు ఇచ్చినా కూడా తల్లి ఆరోగ్యం బాగుకాకపోవడంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ సైదాబాబు, బోజ్యా తదితరులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News