Monday, December 23, 2024

పెట్టుబడి పేరుతో మోసగించిన వ్యక్తి అరెస్ట్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐరన్ ఓర్ లో పెట్టుబడి పేరుతో మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 లో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు నిందితులు పంకిత్, పలాన్ లు ముంబయి వాసికి పరిచయం అయ్యారు. తమకు ఐరన్ ఓర్ వ్యాపారం ఉందని నమ్మించారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని కోరారు. అది నిజం అని నమ్మిన బాధితుడు ఆశిష్ జైన్ రూ.12.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అనంతరం స్పందన లేకపోవడంతో ఆశిష్ సిఐడిని ఆశ్రయించాడు. 2017లో సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ముంబయిలో నిందితుడు పంకిత్ ను అరెస్ట్ చేశారు. పంకింత్ పై నాంపల్లి కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News