బెంగళూరు: తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో గంజాయి ముక్కను పెంచుతున్న ఒక వ్యక్తిని బెంగళూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల రాం ఆశిష్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు.
బెంగళూరులోని కత్తనూరు ప్రాంతంలో ఒక భవనంలోని మూడవ అంతస్తులో అతను అద్దెకు నివసిస్తున్నాడు. ఒక పాత పెయింట్ బకెట్‌లో అతను గంజాయి మొక్కను పెంచుతున్నాడు. ఈ విషయం ఇంటి యజమాని పోలీసులకు చెప్పడంతో వారు అతని ఇంటిపై దాడి చేసి ఆశిష్‌ను అరెస్టు చేశారు. ఆరు అడుగుల ఎత్తు ఉన్న గంజాయి మొక్కను కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాను ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఈ మొక్కను తెచ్చి పెంచుకుంటున్నానని, తాను గంజాయిని తన సొంత అవసరాలకువాడుకుంటున్నానని ఆశిష్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కొత్తనూరు పోలీసు స్టేషన్‌లో ఆశిష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్క విలువ రూ. 15,000 ఉటుందని పోలీసులు తెలిపారు.