Friday, December 20, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికకు వేధింపులు..

- Advertisement -
- Advertisement -

Two men arrested for supplying ganja

మనతెలంగాణ/హైదరాబాద్: నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌తో బాలికను వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… పఠాన్ చెరువుకు చెందిన కోటగిరి హర్షిత్ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహిళలు, బాలికల అశ్లీల ఫొటోలు పెడుతు వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన బాలిక అశ్లీల ఫొటోలను నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టింగ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇన్‌స్టాగ్రాంలో బాలిక తన ఫొటోలను చూసి ఆశ్చర్యానికి గురై మానసికంగా కుంగిపోయింది. వెంటనే బాలిక తల్లి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Man Arrested for harassing a Girl on Instagram in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News