Thursday, January 16, 2025

బూటకపు బాంబు కాల్… వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఓ వ్యక్తి బూటకపు బాంబు కాల్ చేసిన కొద్ది గంటల్లోనే అరెస్ట్ అయి.. 18 రోజుల పాటు జైలు పాలయ్యాడు. సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన అక్బర్ ఖాన్ మంగళవారం రాత్రి ఐఎస్ సదన్ క్రాస్ రోడ్స్ వద్ద బాంబు పెట్టినట్లు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు.

అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు, రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడలిలో సోదాలు నిర్వహించారు. దీనిని మసీదు మందిర్ జంక్షన్ అని కూడా పిలుస్తారు. మసీదు, దేవాలయం, చుట్టుపక్కల ప్రాంతాలలో సోదాలు జరిపారు. దీంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి.

మూడు గంటల పాటు జరిపిన సోదాల తర్వాత అది బూటకపు కాల్ అని పోలీసులు గుర్తించారు. కాగా, పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. అతనిపై సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అక్బర్ ఖాన్‌పై ఐపిసి 182,186,70 (బి) సెక్షన్లు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News