Monday, December 23, 2024

సిద్దరామయ్య ఇంటిపై రాళ్లు రువ్విన వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మైసూరు: మైసూరులోని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నివాసంపై రాళ్లు రువ్విన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.ఆ వ్యక్తిని మైసూరులోని హూటగల్లికి చెందిన సత్యమూర్తిగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి జుడిషియల్ రిమాండ్‌కు పంపారు.

ఈ ఘటన మంగళవారం జరిగింది. బైకుపై బస్తాడు రాళ్లు వేసుకుని టికి లేఅవుట్‌లోని పడువనా రోడ్డుపై ఉన్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య నివాసం వద్దకు చేరుకున్న సత్యమూర్తి ఇంటి ముందు బైకు నిలిపి రాళ్లు రువ్వడం ప్రారంభించాడు. రాళ్లు రువ్వుతున్న సమయంలో అతను సిఎంపై దుర్భాషలాడాడు. రాళ్ల దాడికి ఇంట్లోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. బైకుపై తప్పించుకుని పారిపోతూ చేతనైంది చేసుకోండంటూ అతను సవాలు విసిరాడు.

బైకు రిజిస్ట్రేషన్ నంబర్‌ను రాసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దారిలో అడ్డగించి అతడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా ఒక పోలీసు అధికారిపై దాడి చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. సిఎం ఇంటిపై నిందితుడు రాళ్లు రువ్వడానికి కారణాలేమిటో తెఇయరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News