Sunday, December 22, 2024

20 ఏళ్ల కుమార్తెను చంపి..శవాన్ని మోటారుసైకిల్‌తో ఈడ్చుకెళ్లి…

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒకరోజు బయటకు వెళ్లి వచ్చిన 20 ఏళ్ల కుమార్తెను చంపి ఆమె మృతదేహాన్ని మోటారుసైకిల్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన ఒక కసాయి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మోటారు సైకిల్‌తో మృతదేహాన్ని గ్రామంలో ఈడ్చుకెళ్లి రైల్వే ట్రాకుల మీద శవాన్ని పడేసిన దృశ్యాలు సిసిటివి కెమెరాలో లభించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా ముచ్చల్ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు డిఎస్‌పి కుల్దీప్ సింగ్ తెలిపారు.

కూలీ పనులు చేసుకునే జీవించే బావ్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం ఇంటికి తిరిగిరాగా తన 20 ఏళ్ల కుమార్తె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లినట్లు తెలుసుకున్నాడు. గురువారం ఆ బాలిక ఇంటికి తిరిగిరాగా కుమార్తె ప్రవర్తనపై ఆగ్రహంతో ఉన్న బావ్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. పదునైన ఆయుధంతో ఆమెను పొడిచి చంపివేశాడు. ఆ తర్వాత శవాన్ని మోటారుసైకిల్‌కి కట్టి ఈడ్చుకుంటూ గ్రామం అవతలకు తీసుకెళ్లి రైల్వే ట్రాకుల పైన పడేసి తిరిగి వచ్చేశాడు. పోలీసులు బావ్‌ను అరెస్టుచేసి ఐపిసిలోని 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News