Friday, November 22, 2024

ఆస్తి కోసం తమ్మున్ని హతమార్చిన అన్న అరెస్టు

- Advertisement -
- Advertisement -

Man arrested for killing his brother for property

ఎస్సారెస్పీ కాలువలో పడేసి ప్రమాదవశాత్తు మృతిచెందాడని నమ్మించే ప్రయత్నం
వివరాలను వెల్లడించిన ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మి

సంగెం : ఆస్తి కోసం ఇతరులతో కలిసి తమ్మున్ని హతమార్చిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. సంగెం పోలీస్‌స్టేషన్‌లో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన బాలరాజు ఇంటి నుంచి బయటికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లి రెండు రోజులుగా ఆడా ఈడా వెతికినా దొరకనందున సంగెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబరు 29న రాయపర్తి రిజర్వాయర్‌లో ఒక వ్యక్తి శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించిందని వెంటనే మారబోయిన బాలరాజు కుటుంబ సభ్యులు వచ్చి ఆ శవం బాలరాజుగా గుర్తించారు. సంగెం ఎస్సై దేవేందర్ విచారణలో బాగంగా నేరస్థుడు చనిపోయే ముందు ఎవరితో మాట్లాడాడు అనేది గుర్తించి టెక్నికల్ సపోర్టుతో హత్య చేసిన నేరస్థుడు మారబోయిన కుమారస్వామి, అతనికి సహకరించిన నక్క సుధాకర్, బొల్లా రాజులను గుర్తించి గురువారం అరెస్టు చేసినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కర్ర, రెండు మోటారు సైకిళ్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా మృతుడి మోటారు సైకిల్ నుంచి కుమారస్వామి వ్యవసాయ బావి నుంచి బయటకు తీసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడు మారబోయిన కుమారస్వామి తన తమ్ముడికి చెందిన భూమిని సొంత చేసుకోడానికి పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. కాగా కుమారస్వామి అతని మిత్రులు బాలరాజును గవిచర్లలో బాగా మద్యం తాగించిన అనంతరం ఊరు బయట ఒక కల్వర్టు వద్దకు తీసుకెళ్లి కర్రతో కొట్టి ఆ తరువాత మెడకు తువ్వాలతో ఉరి బిగించి చంపారు. చనిపోయిన తరువాత శవాన్ని మోటారు సైకిల్‌పైన తీసుకెళ్లి ఎస్సారెస్పీ కెనాల్‌లో పడేశారు. మృతుడి మోటారు సైకిల్‌ను బావిలో పడేసి ఆ తరువాత ఎక్కడి వారు అక్కడి వెళ్లిపోయారు. ఈ కేసు ఛాలెంజ్‌గా తీసుకున్న సంగెం ఎస్సై దేవేందర్, పర్వతగిరి సీఐ శ్రీనివాస్, వారి సిబ్బంది టెక్నికల్ సపోర్టుతో సరైన నేరస్థులను గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి తగిన రివార్డు అందచేస్తామని ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News