Wednesday, December 25, 2024

అనుమానంతో భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

పెంచికల్‌పేట్‌ః భార్యపై అనుమానంతో చంపి ఫిట్స్ వచ్చి చనిపోయినట్లు నమ్మించిన భర్తను పోలీసులు రిమాండ్‌కు తరలించిన ఘటన కొమురంభీం జిల్లాలోని కాగజ్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. . వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..  మురళిగూడ గ్రామానికి చెందిన కామెర లక్ష్మికి భర్త శ్రీనివాస్‌తో 18 సంవత్సరాల క్రితం వివాహం కాగా వారికి ఇద్దరు పిల్లలున్నారు. గత 15 సంవత్సరాల నుండి లక్ష్మి ఫిట్స్ వ్యాధితో బాధపడుతుందని, భర్త శ్రీనివాస్ మద్యపానానికి బానిస కావడంతో తరచూ భార్యపై అనుమానంతో తాగి వచ్చి కొట్టేవాడు.

ఈ క్రమంలో ఈ నెల 9 వ తేదిన భార్య భర్తల మధ్య గోడవ జరిగింది. 10వ తేదిన భార్య ఫిట్స్ రోగంతో చనిపోయినట్లు నిందితుడు నమ్మించి దహన సంస్కారాలు జరిపించాడు. అయితే లక్ష్మి  మరణంపై సోదరి వెంకటమ్మకి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా తానే భార్యను మద్యం మత్తులో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడుని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News