సిటిబ్యూరోః వరల్డ్ కప్ క్రికెట్ వన్డే మ్యాచ్‌ల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, అబిడ్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3,40,000 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…అబిడ్స్‌లోని నందనం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఇషాన్ అలీ ఇంటి నుంచే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. అమెరికాలో ఉంటున్న బర్కత్ లలానీ మెయిన్ బూకీ నుంచి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ తీసుకుని పంటర్లకు ఇస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. 2014లో ఇషాన్ అలీ కవాడిగూడకు చెందిన క్రికెట్ బూకీ మేహుల్ వోరా వద్ద పనిచేశాడు. ఈ సమయంలో భారీగా నష్టపోవడంతో బూకీ కన్పించకుండా పోయాడు. ఈ సమయంలో పంటర్లతో అలీకి పరిచయం ఏర్పడింది.
ప్రధాన బూకీ పరిపోవడంతో చాలామంది పంటర్లను ఇషాన్ అలీని క్రికెట్ బెట్టింగ్ కోసం ఫోన్లు చేశారు. దీనిని అవకాశంగా తీసుకున్న నిందితుడు అమెరికాలో ఉంటున్న ప్రధాన బూకీ బర్కాత్ లలానీని సంప్రదించాడు. అతడి ద్వారా పంటర్లకు ఐడి, పాస్‌వర్డ్ పంపిస్తున్నాడు. వారితో బెట్టింగ్ కట్టేవారికి వాటిని ఇస్తున్నారు. దీంతో ఆసక్తి ఉన్న వారు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ డబ్బులు 30శాతాన్ని హవాలా ద్వారా నిందితులు తీసుకుంటున్నారు. తన వాటాకు వచ్చే డబ్బులను తీసుకుంటున్నాడు. ప్రపంచకప్ క్రికెట్ వన్‌డే మ్యాచ్‌లు జరుగుతుండడంతో అలీ ఇంటి నుంచే బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇన్స్‌స్పెక్టర్ సైదులు, ఎస్సైలు అశోక్ రెడ్డి, గగన్‌దీప్, నవీన్ తదితరులు పట్టుకున్నారు.