Wednesday, January 22, 2025

నిషేధిత సిగరేట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నిషేధిత సిగరేట్లు విక్రయిస్తున్న వ్యక్తిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.12లక్షల విలువైన సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని అఫ్జల్‌గంజ్‌కు చెందిన మోహన్‌దాస్ ఠాకూర్ శ్రీగణపతి రోడ్డు లైన్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మంగళ్‌హాట్‌కు చెందిన సయిద్ మోయినుద్దిన్ అలియాస్ బాబా గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ చేస్తున్నాడు, ఎండి అబ్దుల్ రజాక్ అలియాస్ బషీర్ ప్రైవేట్ ఉద్యోగి. ముగ్గురు కలిసి ప్రభుత్వం నిషేధించిన పారిస్ బ్రాండ్ సిగరేట్లు విక్రయిస్తున్నారు.

తక్కువ ధరకు ఢిల్లీ నుంచి ట్రాన్స్‌పోర్టులో హైదరాబాద్‌కు తెప్పించి ఇక్కడి గోడౌన్‌లో నిల్వ చేస్తున్నారు. వాటిని నగరంలోని అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ, జిఎస్‌టి రూపంలో వచ్చే ఆదాయానికి భారీగా నష్టం వస్తోంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పెద్ద ఎత్తున నిషేధిత సిగరేట్లను పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ ఎండి ఖలీల్ పాషా, ఎస్సై షేక్ కవియుద్దిన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News