Sunday, December 22, 2024

ఈ సిగరేట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిషేధిత ఈ సిగరేట్లు విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.4లక్షల విలువైన ఈ సిగరేట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మహారాష్ట్రకు చెందిన సతీష్ హైదరాబాద్, బేగంపేటలో బేకరీ వ్యాపారం చేస్తున్నాడు. బతుకు దెరువు కోసం వచ్చిన సతీష్ ఇక్కడ బేకరీని ఏర్పాటు చేశాడు. బేకరీ వ్యాపారంలో వచ్చే డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో ఈ సిగరేట్లను విక్రయించాలని ప్లాన్ వేశాడు.

ఈ సిగరేట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుండడంతో ప్రభుత్వం నిషేధించింది.దీంతో వీటిని పలువురు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. వీటిని విక్రయించాలని ప్లాన్ వేసిన సతీష్‌కు ముంబాయికి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. అతడి వద్ద ఈ సిగరేట్లను కొనుగోలు చేసి బేకరీలో అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ అనిల్‌కుమార్, ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, షేక్ బురాన్, నర్సింహులు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News