Sunday, January 19, 2025

హైదరాబాద్ లో మళ్లీ గంజాయి చాక్లెట్ల కలకలం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు, పౌడర్ విక్రయిస్తున్న వ్యక్తిని మాదాపూర్ ఎస్‌ఓటి, జగద్గిరిగుట్ట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు (26 కేజీలు), 4 కేజీల గంజాయి పొడి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.2,60,000 ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం…పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కోల్‌కతాకు చెందిన మనోజ్‌కుమార్ అగర్వాల్ జగద్గిరిగుట్ట, రోడ్డు నెంబర్1లో జయశ్రీ ట్రేడర్స్ (కిరాణా దుకాణం)నిర్వహిస్తున్నాడు. కోల్‌కతాకు చెందిన మోహన్ వద్ద గంజాయి కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు.

నిందితుడు కిరాణా షాపులో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే దాడి చేసిన పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక్కో గంజాయి ప్యాకెట్‌ను నిందితుడు రూ.1,000లకు కొనుగోలు చేస్తున్నాడు. గంజాయి పొడి నాలుగు కిలోలను రూ.10,000లకు విక్రయిస్తున్నాడు. వాటిని అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా విచారణలో – గంజాయి చాక్లెట్స్ , గంజాయి పొడిని కొలకత్తాకు చెందిన మోహన్ అనే వ్యాపారి వద్ద కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News