హైదరాబాద్: బ్రాండెడ్ దుస్తుల పేరుతో నకిలీ వాటిని తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి లూయిఫిలిప్, అలెన్‌సోలి నకిలీ టీషర్ట్, జీన్స్, షర్ట్, కాటన్ ప్యాంట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.2,24,000 ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం…. రంగారెడ్డి జిల్లా, కొత్తపేట, మోహన్ నగర్ కాలనీకి చెందిన సాండి సత్యపాల్ రెడ్డి వ్యాపారం చేస్తున్నాడు. ఆర్‌బిఐ కాలనీలో శ్రీవిజయ గార్మెంట్స్ పేరుతో మెన్స్‌వేర్‌ను నిర్వహిస్తున్నాడు. తన దుస్తులను నిల్వ చేసేందుకు కొత్తపేటలో గోడౌన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
ప్రముఖ బ్రాండ్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో దానిని సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేశాడు. లూయిఫిలప్, అలెన్ సోలి బ్రాండ్లకు చెందిన దస్తుల పేరుతో స్థానికంగా దుస్తులకు తయారు చేసి వాటికి ఈ బ్రాండ్లకు చెందిన లేబుళ్ల వేస్తున్నాడు. వాటిని పలువురు అమాయకులకు విక్రయిస్తున్నాడు. చాలామంది అమాయకులు ఇవి నిజమని నమ్మి పలువురు నిందితుడి వద్ద అసలు బ్రాండ్ల అని నమ్మి కొనుగోలు చేస్తున్నారు. ఇలా చేసి చేసి కాపీరైట్స్ చట్టం నిషేధిస్తున్నాడు. ఈ సమాచారం రావడంతో ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ అంజిరెడ్డి, రవికుమార్, ఎస్సైలు రాజు, ఎండి తకియుద్దిన్ తదితరులు పట్టుకున్నారు.