Monday, December 23, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

పరారీలో ఇద్దరు నిందితులు
70 గ్రాముల ఎండిఎంఏ, కారు స్వాధీనం
వివరాలు వెల్లడించిన మాదాపూర్ డిసిపి శిల్పవల్లి
Man arrested for selling drugs

మనతెలంగాణ, సిటిబ్యూరో: నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్‌ఓటి మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి డ్రగ్స్ సపరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. నిందితుడి వద్ద నుంచి 70 గ్రాముల ఎండిఎంఏ, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.10,00,000 ఉంటుంది. మాదాపూర్ డిసిపి శిల్పవల్లి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా, బిచ్చుకుండా మండలం, పెద్ద దేవడ్డా గ్రామానికి చెందిన మటం వీరేందర్ అలియాస్ వీరు వ్యాసనాలకు బానిసగా మారాడు.

సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్ శర్మ, నరేష్ చౌదరిని సంప్రదించాడు. వారి వద్ద నుంచి గ్రాముకు ఎండిఎంఏను రూ.1,000 కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి ఇక్కడ రూ.6,000 నుంచి రూ.7,000లకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే నిందితుడు మాదాపూర్ జంక్షన్ డ్రగ్స్ విక్రయించేందుకు కారులో రాగా పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ శివకుమార్, ఎస్సైలు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News