Monday, December 23, 2024

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నిందితుడిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 164 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బీహార్‌కు చెందిన ఎండి జాఫర్ ఉర్ హక్ 2015లో నగరానికి భార్యా పిల్లలతో కలిసి వచ్చి ఆసిఫ్‌నగర్‌లో ఉంటున్నాడు.

కుటుంబం పోషించడం భారంగా మారడంతో గంజాయి చాక్లెట్లు విక్రయించేందుకు ప్లాన్ వేశాడు. బీహార్ నుంచి రెండు నెలలకు ఒకసారి గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వస్తున్నాడు. ఇక్కడ తనకు తెలిసిన బీహారీలకు రూ.20 నుంచి 50లకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ ఎంండి ఖలీల్‌పాషా, ఎస్సై ఎండి ముజఫర్ అలీ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News