Thursday, December 12, 2024

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 4.957కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…బీహార్ రాష్ట్రానికి చెందిన వీరేంధ్రబూ పండరీ బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ పనిచేస్తూనే హైదరాబాద్‌లో గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు గ్రహించిన నిందితుడు బీహార్ రాష్ట్రం నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చి ఇక్కడ కూలీలకు విక్రయిస్తున్నాడు.

బోడుప్పల్‌లోని గౌతంనగర్ ప్రాంతంలో ఉన్న స్లమ్ ఏరియాలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు రంగారెడ్డి ఎస్‌టిఎఫ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ స్లమ్ ఏరియాలో పని చేసే వారికి ఒక్కో చాక్లెట్‌ను రూ.15కు విక్రయిస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. దాడిలో ఎస్సైలు అఖిల్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు సుధాకర్, రవి, కిషన్‌రావు, సుధీష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News