Thursday, December 19, 2024

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శేరిలింగంపల్లి ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.897కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బోరబండకు చెందిన పత్తిపాక ప్రభాకర్ గుట్టల బేగంబజార్, నవభారత్ నగర్ కాలనీలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లిన ఎక్సైజ్ సిబ్బంది ప్రభాకర్‌ను పట్టుకున్నారు. నిందితుడు అక్కడ బైక్‌పై గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. తర్వాత నిందితుడి ఇంట్లో తనిఖీలు చేయగా గంజాయి లభించింది.

గంజాయి పట్టుకున్న టీమ్‌లో ఎస్సై బాలరాజు, కానిస్టేబుళ్లు సంతోష్, నితిన్, సాయి కిరణ్, ప్రసన్న, లక్ష్మణ్ ఉన్నారు. కాగా ఎస్‌ఆర్ నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 6.300కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని పాడేరు జిల్లాకు చెందిన మాధవరావు నగరంలోని ఎల్లారెడ్డిగూడలో ఉంటూ హోటల్‌లో పనిచేస్తున్నాడు. మాధవరావు తన స్నేహితుడు రాకేష్‌తో కలిసి గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News