మనతెలంగాణ, హైదరాబాద్ : రెమ్‌డెసివిర్ను అధిక ధరలకు విక్రయిస్తున్న మెడికల్ షాపు నిర్వాహకుడిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని యూసుఫ్‌గూడ, రెహ్మత్ నగర్‌కు చెందిన షేక్ మజహర్ మెడికల్ షాపును నిర్వహిస్తున్నాడు. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో రెమ్‌డెసివిర్‌కు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. దీంతో నిందితుడు అధిక ధరలకు రెమ్‌డెసివిర్ను విక్రయించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. సాధారణంగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర రూ.5,400 ఉంటుంది. కాని నిందితుడు మార్కెట్‌లో రూ.35,000 చొప్పున విక్రయిస్తున్నాడు. మజహర్ లంగర్‌హౌస్ సమీపంలోని అలీవ్ ఆస్పత్రి సమీపంలోకి బైక్ రాగా పోలీసులు పట్టుకున్నారు. రెమ్‌డెసివిర్ను విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు కోసం లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సైలు ముజఫర్‌అలీ, మల్లికార్జున్, రంజిత్ తదితరులు పట్టుకున్నారు.