- Advertisement -
హైదరాబాద్: నిషేధిత పొగాకు వస్తువులు విక్రయిస్తున్న వ్యక్తిని టపాచపుత్ర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 14 రకాల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….టపాచపుత్ర, ఆలీ నగర్‌కు చెందిన సయిద్ ఖదీర్ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన పొగాకు వస్తువులు విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో దాడి చేసి గుట్కాలు, నమిలే పొగాకు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అంబేద్కర్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -